నాదల్‌ అరుదైన రికార్డు

క్లే కోర్టు రారాజు  స్పెయిన్‌ దిగ్గజం రఫెల్‌ నాదల్‌  అరుదైన ఘనత



పురుషుల సింగిల్స్‌లో 1,000వ విజయాన్ని సొంతం చేసుకొని ఓపెన్‌ శకంలో వెయ్యి సింగిల్స్‌ మ్యాచ్‌లు గెలిచిన నాలుగో ప్లేయర్‌గా నాదల్‌ నిలిచాడు. స్పెయిన్‌ దిగ్గజం రఫెల్‌ నాదల్‌ ఫ్రాన్స్‌లో జరుగుతున్న రోలెక్స్‌ పారీస్‌ మాస్టర్స్‌ తొలి రౌండ్‌లో ఫెలిసియానో లోపెజ్‌ను 4-6, 7-6(5), 6-4 తో ఓడించి స్పెయిన్‌ బుల్ అరుదైన ఘనత సాధించాడు. ఏటీపీ టూర్‌లో అతనికి 1,000 విజయం కావడం విశేషం.

నాదల్ కంటే ముందు ఈ ఘనత ను జిమ్మీ కానర్స్(1,274), రోజర్ ఫెదరర్(1,242), ఇవాన్ లెండిల్(1,068) ఈ ఫీట్‌ సాధించారు. ఎనిమిదేండ్ల వయసులో అండర్‌-12 రీజనల్‌ టైటిల్‌ గెలిచిన నాదల్‌..12 ఏళ్లలోనే స్పెయిన్‌, యూరోపియన్‌ ఏజ్‌ గ్రూప్‌ టైటిళ్లు సాధించాడు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.