వంద పుట్టిన రోజులను పూర్తి చేసిన మూడవ భారత క్రికెటర్‌గా నిలిచిన చందోర్కర్
వంద పుట్టిన రోజులను పూర్తి చేసిన మూడవ భారత క్రికెటర్‌గా నిలిచిన భారత వెటరన్ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ రఘునాథ్ చందోర్కర్ novmeber 21 వందో పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. మహారాష్ట్ర, బాంబే తరఫున ఏడు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. వంద పుట్టిన రోజులను పూర్తి చేసిన మూడవ భారత క్రికెటర్‌గా చందోర్కర్ నిలిచాడు.
రఘునాథ్ చందోర్కర్ 1920లో కార్జాత్‌లో జన్మించాడు.1943-44, 1946-47 మధ్య మహారాష్ట్ర తరఫున 1950-51 సీజన్‌లో బాంబే తరఫున చందోర్కర్ రంజీ మ్యాచ్‌లు ఆడారు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రఘునాథ్ 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 155 పరుగులు చేశాడు. రంజీ ఆటగాళ్లలో ఇప్పటి వరకు ప్రొఫెసర్ డీబీ దేవ్‌ధర్ (1892-1993--101 yrs 222 days), వసంత్ రాయ్‌జీ (1920-2020) మాత్రమే వందేళ్లు బతికారు. ఈ ఏడాది జనవరిలో 100వ పడిలోకి అడుగుపెట్టిన వసంత్(100 yrs 139 days) గత జూన్‌లో మరణించారు.