2024 పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో బ్రేక్‌డ్యాన్స్
పారిస్‌లో జరగనున్న ఒలింపిక్స్ క్రీడల్లో బ్రేక్ డ్యాన్స్ క్యాటగిరీలో పోటీలు నిర్వహించనున్నారు. 2024లో ప్రాన్స్ రాజదాని పారిస్ ఈ క్రీడలు జరగనున్నాయి. పారిస్ క్రీడా నిర్వహణ చీఫ్ టోనీ ఈస్టన్‌గేట్ ఇవాళ పారిస్‌లో మీడియాతో ఈ విషయాన్ని వెల్లడించారు. పారిస్ మెగా ఈవెంట్‌లో మొత్తం నాలుగు కొత్త క్రీడలు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి. సర్ఫింగ్, స్కేట్‌బోర్డింగ్, స్పోర్ట్స్ క్లైంబింగ్‌తో పాటు బ్రేక్ డ్యాన్సింగ్ కూడా ఉండనున్నది. యువతను క్రీడల వైపు ఆకర్షింప చేయాలన్న ఉద్దేశంతో ఒలింపిక్స్ క్రీడల్లో బ్రేక్‌డ్యాన్స్‌కు చోటు కల్పించారు. అన్ని డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ల్లో బ్రేక్‌డ్యాన్స్‌ను జనం చేస్తున్నట్లు టోనీ తెలిపారు. సాంకేతికంగా, శారీరకంగా బ్రేక్‌డ్యాన్స్ అథ్లెట్లు ఆకట్టుకుంటారని, అందుకే ఈ క్రీడ పట్ల ఆసక్తి చూపామని, ఫీడ్‌బ్యాక్ కూడా బాగుందని ఆయన అన్నారు. 2022లో జరగనున్న ఆసియా క్రీడల్లో ఈ-స్పోర్ట్స్‌కు ఆమోదం దక్కింది. మెడల్ ఈవెంట్‌గా ఆన్‌లైన్ గేమింగ్‌ను నిర్వహించనున్నారు. చైనాలోని హాంగ్‌జూలో ఆ క్రీడా వేడుకలు జరగనున్నాయి. మస్కట్‌లో జరిగిన ఆసియా ఒలింపిక్ మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
2024 ఒలింపిక్స్ క్రీడలు : ప్రాన్స్ రాజదాని పారిస్
2022 ఆసియా క్రీడలు : చైనాలోని హాంగ్‌జూ