అండర్-19 ప్రపంచ కప్‌ను గెలిచిన భారత జట్టు సభ్యుడు తన్మయ్ శ్రీవాస్తవ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు విరాట్ కోహ్లి సారథ్యంలో 2008లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్‌ను గెలిచిన భారత జట్టు సభ్యుడు తన్మయ్ శ్రీవాస్తవ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఎడంచేతి వాటం బ్యాట్స్‌మన్ తన్మయ్ శ్రీవాస్తవ అక్టోబర్ 24వ తేదీన వెల్లడించాడు.
భారత్ విజేతగా నిలిచిన అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేశాను.
క్రికెట్ కాకుండా నా జీవితంలో సాధించాల్సిన ఇతర లక్ష్యాలు ఉన్నాయి. ఇకపై వాటిని సాధించేందుకు కృషి చేస్తాను’ అని 30 ఏళ్ల శ్రీవాస్తవ వ్యాఖ్యానించాడు.
ప్రస్తుత భారత సారథి విరాట్ కోహ్లి నాయకత్వంలోని భారత జట్టులో సభ్యుడైన శ్రీవాస్తవ అండర్-19 ప్రపంచ కప్‌లో మెరుగైన ప్రదర్శన చేశాడు. 262 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలవడంతో పాటు ఫైనల్లో కీలకమైన 43 పరుగులు చేసి జట్టును విశ్వ విజేతగా నిలపడంలో ప్రముఖ పాత్ర పోషించాడు.
ఐపీఎల్ జట్లు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, కొచ్చి టస్కర్‌లకు ఆడాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ జట్లకు ఆడిన శ్రీవాస్తవ... 90 మ్యాచ్‌ల్లో 4,918 పరుగులు చేశాడు. అందులో 10 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అండర్-19 ప్రపంచ కప్‌లో తనతో పాటు ఆడిన కోహ్లి, రవీంద్ర జడేజా భారత సీనియర్ జట్టులో చోటు దక్కించుకోగా శ్రీవాస్తవ మాత్రం అందులో విఫలమయ్యాడు.