న్యూజిలాండ్ పేసర్ బెన్ లిస్టర్ క్రికెట్ చరిత్రలో తొలి కరోనా వైరస్ సబ్‌స్టిట్యూట్ ఆటగాడిగా నిలిచాడు.
🏏న్యూజిలాండ్ పేసర్ బెన్ లిస్టర్ క్రికెట్ చరిత్రలో తొలి కరోనా వైరస్ సబ్‌స్టిట్యూట్ ఆటగాడిగా నిలిచాడు. దేశవాళీ టోర్నీ ప్లంకెట్ షీల్డ్ ఫస్ట్‌క్లాస్ ఛాంపియన్‌షిప్‌లో ఆడుతున్న ఆల్‌రౌండర్ మార్క్ చాప్‌మన్ స్థానంలో లిస్టర్.. ఆక్లాండ్ జట్టులోకి వచ్చాడు. చాప్‌మన్ కోవిడ్-19 పరీక్ష చేయించుకోవడం కోసం వెళ్లడంతో అతని స్థానంలో లిస్టర్ మైదానంలోకి అడుగుపెట్టాడు. 26ఏండ్ల చాప్‌మన్‌కు కరోనా నెగెటివ్‌గా తేలితో అతడు మళ్లీ జట్టులో చేరనున్నాడు.
🏏న్యూజిలాండ్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడిన చాప్‌మన్ సోమవారం అస్వస్థతకు గురయ్యాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో కొవిడ్ సబ్‌స్టిట్యూట్ నిబంధనలను ఐసీసీ గత జూన్‌లో ఆమోదించిన విషయం తెలిసిందే. ఆటగాళ్లు అనారోగ్యం బారినపడిన లేదా కోవిడ్-19 లక్షణాలు కనిపిస్తే వాళ్ల స్థానంలో మరొక ఆటగాడిని తుది జట్టులోకి తీసుకోవచ్చు. ఒకవేళ ఆ ప్లేయర్‌కు కరోనా ఫలితం నెగెటివ్‌గా తేలితే మళ్లీ జట్టులోకి రావొచ్చు.