TSGLI కొన్ని ముఖ్యమైన ఉత్తర్వులు

 TSGLI కొన్ని ముఖ్యమైన ఉత్తర్వులు


2015 రివైజ్డ్ స్కేల్ ల  అనుసరించి TSGLI స్లాబు రెట్లు సవరించడం జరిగింది.

(G.O.Ms.No.49 తేది:27-04-2015)


 స్లాబురేట్ల పైన కాకుండా బేసిక్ పే పై 20% వరకు ప్రీమియం చెల్లించవచ్చు.

(G.O.Ms.No.26 తేది:22-02-1995)


సరళీకరించిన ప్రతిపాదన దరఖాస్తును ప్రవేశపెట్టడం జరిగింది.

(G.O.Ms.No.189 తేది:10-07-2013)


మున్సిపల్  ఉద్యోగ,టీచర్లకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఎయిడెడ్ టీచర్లకు వర్తించదు.

(G.O.Ms.No.25 తేది:03-03-2011)

 21 సం॥ పైన 53 సం॥ లోపు వయస్సు గల రాష్ట్ర ప్రభుత్వ మరియు పంచాయతీరాజ్ ఉద్యోగులు,10 సం॥ సర్వీసు పూర్తిచేసిన వర్క్ చార్టెడ్ ఉద్యోగులు తప్పనిసరిగా తమజీతాల నుంచి రికవరీ చేసి పాలసీబాండ్ పొందాలి.


 గర్భిణీలు ప్రసవించిన 6 నెలల తరువాతే భీమాకు అర్హులు.


ప్రస్తుతం పాలసీ చెల్లిస్తున్నవారు 48 సం॥ దాటినవారు మరోపాలసీ 53 సం॥ల వయస్సు వరకు మాత్రమే తీసుకోవచ్చును.

(Memo.No.29335/342/A2 తేది:05-03-2010 & G.O.MsNo.16 తేది:17-02-2011)

 అప్రెంటీస్ వ్యవస్థ రద్దుకావడం వల్ల 1సం॥ వరకు వేచి వుండకుండా మొదటి నెల జీతంతో మినహాయించవచ్చు.

(G.O.Ms.No.199 తేది:30-07-2013)


ఉద్యోగుల జీతాల నుంచి ప్రీమియం మినహాయించి,ప్రతిపాదనలు స్వీకరించి,వాటిని జిల్లా కార్యాలమునకు పంపవలసిన బాధ్యత DDO లకు ఉంది.

(G.O.Ms.No.43 తేది:21-01-1989)

(G.O.Ms.No.368 తేది:15-11-1994)


 పాలసీ నెంబర్ మరియు నామిని వివరాలు విధిగా సర్వీసు రిజిస్టరులో నమోదు చేయించాలి.


TSGLI ప్రీమియంకు సెక్షన్-80సి ప్రకారం ఆదాయపు పన్ను నుండి మినహాయింపు కలదు.


 సం॥కి 9% వడ్డీతో 90% వరకు లోన్ సౌకర్యం కల్పిస్తారు.


 ప్రస్తుతం అన్ని పాలసీ బాండ్లను క్రింద తెలిపిన వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. www.tsgli.telangana.gov.in

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.