వీలునామాWILL అంటే ఏమిటి ? దానిని ఏవిదంగా వ్రాయవచ్చు వీలునామా వ్రాసేవారికి అర్హతలు తెలుసుకుందాం.....

 వీలునామాWILL అంటే ఏమిటి? దానిని ఏవిదంగా వ్రాయవచ్చు వీలునామా వ్రాసేవారికి అర్హతలు తెలుసుకుందాం


వీలునామా అనేది ఒక వ్యక్తి యొక్క ఆస్తిని అతని / ఆమె కోరిక ప్రకారం మరణం తరువాత బదిలీ చేయడానికి ఉపయోగించే చట్టపరమైన పత్రం / ఒక వ్యక్తి తన ఇష్టాన్ని లేదా అభీష్టాన్ని వ్యక్తం చేసే పత్రాన్నే విల్ అని ప్రముఖ న్యాయవాది ఎస్ . ఆర్. ఆంజనేయులు పేర్కొన్నారు


 ఆ వ్యక్తి  వీలునామా రాసినప్పటికినీ, తన మరణానంతరం ఆ వీలునామా అమల్లోకి వస్తుంది. వీలునామానే  మరణ శాసనం అని కూడా అంటారు. వీలునామా అనేది మనిషి యొక్క చివరి కోరికగా అనుకోవచ్చు. వారసత్వ వివాదాల పరిష్కారం కోసం వివిధ కోర్టుల ముందు లక్షలాది సివిల్ కేసులు పెండింగ్‌లో ఉన్నందున విల్ యొక్క ప్రాముఖ్యతను తగినంతగా నొక్కి చెప్పలేము. ఇంకా, అన్ని విల్స్ వ్యక్తి జీవితంలో ఎప్పుడైనా ఉపసంహరించబడతాయి మరియు ఇది రహస్య పత్రం. అందువల్ల, ప్రతి ఒక్కరూ విల్ కలిగి ఉండటం మరియు విల్ సృష్టించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.


1)ఒక వ్యక్తి తన జీవితకాలంలో సంపాదించిన స్థిర, చర ఆస్తి గురించిన సంతోషం కంటే.... తన తదనంతరం ఆ ఆస్తి కోసం తన కుటుంబ సభ్యులు ఎలా కొట్లాడుకుంటారో అన్న భయం, బెంగ ఎక్కువగా ఉంటుంది. ఆస్తి పెరుగుతున్న కొద్దీ ఈ భయం ఉంటుంది. ఇలాంటి భయాలు, బెంగలు నివారించి వాటిని అరికట్టడం కోసం తాను జీవించి ఉండగా చేసే చట్టబద్ధమైన స్వయం నిర్ణయమే వీలునామా.  (స్థిర ఆస్తి అంటే ఇల్లు, ఇళ్ల స్థలములు, వ్యవసాయ భూములు, తోటలు వగైరా... చరాస్తి అంటే నగదు, బ్యాంకు నిల్వలు, ఫర్నిచర్, పుస్తకాలు, పాత సామానులు, డివిడేండ్లు, బోనస్, కారు,ఉమ్మడి ఆస్తిలో తనకు వచ్చు వాటా మొదలైనవి.)


2)వీలునామా రాసే వ్యక్తి మంచి తెలివితో, వ్యవహార జ్ఞానంతో వీలునామా రాస్తేనే చెల్లుబాటు అవుతుంది. ఒకసారి వీలునామా రాసిన తర్వాత మరల దానిని రద్దుపరచి కొత్త వీలునామా కూడా రాయవచ్చు. రద్దు పరచడం అంటే పాత వీలునామాని చించవచ్చు లేదా తగలబెట్టవచ్చు లేదా  కొత్త వీలునామాలో పాత దాన్ని రద్దు చేస్తున్నట్లు రాసుకోవచ్చు. అలా ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు అంతకు ముందు తాను రాసిన వీలునామా రద్దుపరచి కొత్త వీలునామా రాయవచ్చు. వీలునామా ఏ బాష లోనైనా రాయొచ్చు. చివరిగా రాసిన వీలునామానే చెల్లుబాటు అవుతుంది.


3) వీలునామా తప్పనిసరిగా రిజిస్టర్ ఆఫీస్‌లో రిజిస్టర్ చేయవలసిన అవసరం లేదు. ఎవరైనా వ్యక్తి తాను ఉన్న చోట నుండి తెల్ల పేపరు లేదా బాండ్ పేపర్ మీద స్వదస్తూరితో గాని లేదా దస్తావేజు లేఖరితో గాని వీలునామా రాయవచ్చు లేదా రాయించు కోవచ్చు. వీలునామాలో ఏమైనా తప్పులు దొర్లితే వీలునామా రాసిన వ్యక్తి కొట్టివేతలున్న చోట సంతకం చేయాలి. ఇలా డబ్బు ఖర్చు లేకుండా ఎన్ని సార్లయినా వీలునామా మార్చి మార్చి రాసుకోవచ్చు.


4)వీలునామా  అనేది వ్యక్తి మరణానంతరము అమల్లోకి వస్తుంది. కనుక దానిలో తన అభిమతానికి అనుగుణంగా తాను మరణించే లోపు ఎన్ని మార్పులు చేర్పులు అయిన డబ్బు ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. కానీ ఆస్తి పంపకాలు (పార్టీషన్), దానధర్మాలు (గిఫ్ట్), ఆస్తి సంబంధిత పత్రాల పరిష్కారాలు ఇతర లావాదేవీలన్నీ తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలి. విల్ మినహా ఏ రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేయటానికి వీలుండదు. కాబట్టే అందరూ వీలునామాకు  ఆసక్తి చూపుతారు. 


5) ఒకవేళ వీలునామాని భద్రపరచాలి అనుకుంటే వీలునామా రాసిన వ్యక్తి వీలునామాను సబ్ రిజిస్టార్ వద్ద డిపాజిట్ చేయించవచ్చు. సబ్ రిజిస్ట్రార్ ఆ వీలునామాను ఫైర్ సేఫ్టీ గదిలో భద్రపరచాలి. వీలునామ రాసిన వ్యక్తి రిజిస్ట్రార్ భద్రపర్చిన పత్రాన్ని  ఎప్పుడైనా కోరితే రిజిస్ట్రార్ ఇస్తాడు. ఒకవేళ వీలునామా రాసిన వ్యక్తి చనిపోతే అతని వారసులు అతని డెత్ సర్టిఫికెట్ రిజిస్ట్రార్‌కి అందజేస్తే వీలునామాను అతని వారసులకు ఇస్తాడు.


6)  వీలునామా ద్వారా మైనర్లకు ఆస్తి పాస్తులను సంక్రమింప చేయాలనంటే మైనర్‌కు గార్డియన్ ఉంటేనే వీలునామా చెల్లుతుంది. 


7) సబ్ రిజిస్ట్రార్ వద్ద డిపాజిట్ చేసిన వీలునామా ఆ వీలునామా రాసిన వ్యక్తి చనిపోయిన తర్వాతే అతని వారసులకు ఇవ్వబడుతుంది. 


8) వీలునామాలో ఏదైనా షరతు పెట్టి వీలునామా రాసి ఉంటే ఆ షరతులు పూర్తి చేస్తేనే ఆ వీలునామా చెల్లుబాటు అవుతుంది. 


9) వీలునామాలో కనీసం ఇద్దరు సాక్షులు ఉండాలి. ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది సాక్షులు కూడా ఉండవచ్చు. ఏదైనా వివాదం ఏర్పడినట్లయితే కోర్టుకి ఒక్కరైనా వచ్చి సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది.


10) వీలునామాలో ఆస్తుల్ని రాసేటప్పుడు కచ్చితమైన హక్కులతో సహా సర్వే నెంబర్లతో సహా రాయాలి. తనకున్న ఆస్తులని మాత్రమే వీలునామాలో రాయాలి. తనకు లేని ఆస్తులను వీలునామాలో రాయకూడదు. భవిష్యత్తులో వచ్చే ఆస్తులను వీలునామాలో రాయకూడదు.


11) ఎవరి చేతనైనా వీలునామా రాయించి ఉండి ఉంటే ఆ దస్తూరి రాసిన వ్యక్తి చేత తప్పనిసరిగా సంతకం (చివరి పేజీలో) చేయించాలి. ఒక వేళ కంప్యూటర్ చేయించి ఉంటే ఆ కంప్యూటర్ షాప్ గల వ్యక్తి పేరు, అడ్రస్ ఆ వీలునామాపై రాయించాలి. 


12)వీలునామా రాసిన తర్వాత రద్దు పరచి మరొక వీలునామా రాయాలనుకుంటే గతంలో రాసిన వీలునామా గురించి ఉదహరించాలి. వీలునామా రాసిన వ్యక్తి (వీలునామాదారు) మరణించక ముందే వీలునామా ద్వారా ఆస్తులను పొందినవారు మ్యుటేషన్ చేయించుకోలేరు. 


13) వీలునామాను కుంటి, గుడ్డి, అవిటి వారు కూడా మానసిక పరిస్థితి బాగుంటే రాయవచ్చు.


14) వీలునామా ద్వారా ఆస్తి పొందినవాడు వీలునామా రాసిన వ్యక్తి చనిపోక ముందే ఇతరులకు అమ్మకూడదు లేదా అన్యాక్రాంతం చేయటానికి అవకాశం లేదు. 


15) ముస్లింలలో వీలునామా అనేది లిఖిత పూర్వకంగా రాయాల్సిన అవసరం లేదు. అంటే నోటి మాట ద్వారా కూడా వీలునామా ప్రకటించవచ్చు. ఒక వేళ వీలునామా రాయాల్సి వచ్చినా కూడా దానిపై వీలునామా చేయాల్సిన వ్యక్తి సంతకం లేదా వేలి ముద్ర వేయాల్సిన అవసరం లేదు. సాక్షి సంతకాలు కూడా అవసరం లేదు. ఒకవేళ ఆసక్తి ఉంటే ముస్లింలు వీలునామాను రిజిస్టర్ కూడా చేయించుకోవచ్చు. ముస్లింలు తన ఆస్తిలో 1/3 వంతు వరకు మాత్రమే వీలునామా చేయొచ్చు. 2/3 వ వంతు తన వారసులకు వదిలేయాలి. ముస్లింలలో వారసులు లేని వారు యావదాస్తిని వీలునామా క్రింద ఇతరులకు రాయొచ్చు. ముస్లింలలో వీలునామాని అమలు పరచదగ్గ వ్యక్తి (ఎగ్జిక్యూటర్) ముస్లిం కాకుండా కూడా ఉండొచ్చు. ముస్లింలు తమ ఆస్తిని ఏ ఇతర మతస్తులకయినా కూడా వీలునామా రాయొచ్చు. హిందువులలో వలెనే ముస్లింలు కూడా తాను రాసిన వీలునామాని రద్దు చేసుకోవచ్చు. అవసరమైతే మార్పులు-చేర్పులు కూడా చేసుకోవచ్చు.


●16)  ఒక వ్యక్తి వీలునామా వ్రాయకుండా చనిపోతే అతనికి ఉన్న ఆస్తులు హిందూ వారసత్వ చట్టం ప్రకారం అతని వారసులకు చెందుతాయి.


●17)  మానసికంగా బలహీనంగా ఉన్నవారు లేదా మానసిక అస్వస్థతతో ఉన్న వారు వీలునామా రాయకూడదు. ఒక వేళ అలా రాస్తే తరవాత ఆ ఆస్థి పొందిన వ్యక్తి తనకు సరయిన విధంగానే ఆస్తి వచ్చిందని నిరూపించుకోవాల్సి ఉంటుంది.


18) వీలునామా రాసిన వ్యక్తి తెల్ల కాగితం మీద కానీ స్టాంప్ పేపర్ మీద కాని రాయొచ్చు. ప్రతి పేజీ మీద వీలునామా రాసిన వ్యక్తి సంతకం చేయాల్సి ఉంటుంది. సాక్షులు, దస్తూరి రాసిన వ్యక్తి తప్పనిసరిగా  చివరి పేజీ మీద సంతకం చేయాలి. 


19) వీలునామా రాసిన వ్యక్తి తాను రాసిన వీలునామాని అమలు పరచడం కోసం నమ్మకమైన వ్యక్తిని ఎగ్జిక్యూటర్‌గా నియమించుకోవచ్చు. ఎగ్జిక్యూటర్ (వీలునామా అమలుపరచదగిన వ్యక్తి) అనేవారు వీలునామా రాసిన వ్యక్తికి బంధువు అయి ఉంటే మంచిది. వీలునామా రాసిన వ్యక్తికి ఆస్థులున్న చోట నివాసం వుండే వ్యక్తిని Executor గా నియమించుకోవచ్చు. అవసరమైతే Executor ను సాక్షిగా ఉపయోగించవచ్చు. ఆ వీలునామా ద్వారా లబ్ది పొందే వ్యక్తిని కూడా ఎగ్జిక్యూటర్ గా నియమించు కోవచ్చు. వీలునామా రాసే వ్యక్తి వీలునామాను అమలు చేసే ఎగ్జిక్యూటర్‌కు కొంత పరిహారాన్ని ఇవ్వొచ్చు.


20) ఒక వ్యక్తికి జాయింట్ కుటుంబ ఆస్తిలో వాటా ఉండి, ఆ ఆస్తిలో తనకు రాబడే అనిర్దిష్ట అంటే ఇంకా పంపకం కాని ఆస్తుల్ని కూడా వీలునామా చేయొచ్చు. 


21) వీలునామాదారు కొత్తగా పెళ్లి చేసుకుంటే గతంలో చేసిన వీలునామా రద్దు అవుతుంది.


22) సహజంగా వీలునామాలో పేర్కొనబడిన సాక్షులు, దస్తూరి, ఎగ్జిక్యూటివ్ అనేవారు వీలునామా రాసిన వ్యక్తి కంటే వయసులో తక్కువ ఉంటే మంచిది. ఎందుకంటే వీలునామాను వారు అమలు చేయాల్సి వుంటుంది కనుక. 


23) డిఫెన్స్ అనగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లలో పనిచేసేవారు తమకున్న ఆస్తిపాస్తులన్నీ వీలునామా ద్వారా ఇతరులకి ఇవ్వొచ్చు. అయితే వీలునామా రాసిన వ్యక్తి తప్పనిసరిగా సంతకం చేయాలనే నిబంధన లేదు. సాక్షి సంతకం కూడా ఉండవలసిన అవసరం లేదు. ఎవరైనా ఇద్దరు వ్యక్తుల సమక్షంలో చెప్పినా సరిపోతుంది. 


24)  వీలునామాని రద్దు చేయకుండా మార్పులు-చేర్పులు చేసుకోవడాన్ని కోడోసిల్ (CODOCIL) అంటారు. వీలునామాలో అదనపు విషయాలు చేర్చవచ్చు. కొన్ని విషయాలు తొలగించవచ్చు. మార్పులు, చేర్పులు చేయాలంటే వేరే కాగితంపై రాయవచ్చు లేదా రాసిన వీలునామా వెనుక మరలా రాయవచ్చు. 


25) భార్య-భర్తలు కలిసి జాయింట్‌గా వీలునామా రాయొచ్చు. మార్పులు, చేర్పులు ఎక్కువగా ఉంటే కోడోసిల్ ప్రకారం రాయటం కంటే మరియొక వీలునామా రాయటం మంచిది.


26)  వీలునామాలో ఉన్న సాక్షులు ఆ వీలునామా  ద్వారా లబ్ధి పొందకుండా ఉండేలా వీలునామా రాసే వ్యక్తి జాగ్రత్తపడాలి. వీలునామాలో ఉన్న సాక్ష్యులు స్వతంత్ర వ్యక్తులై, వీలునామా రాసిన వ్యక్తితో బంధుత్వం లేకుండా ఉంటే మంచిది. 


27)  వీలునామా ద్వారా కుటుంబ సభ్యులకు లేక ఎవరైనా ఇతరులకు లేక ట్రస్టులకు, సంస్థలకు ఎవరికైనా ఆస్తులని రాయొచ్చు.


28)  క్రిస్టియన్లు కూడా హిందువుల వలెనే వీలునామా నియమాలను పాటించవలసి ఉంటుంది. 


29)  వీలైనంత వరకు వీలునామాని రిజిస్టర్ చేస్తే భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా నివారించవచ్చు. 


30) వీలునామాలో ఉన్న మంచి సౌలభ్యం ఏంటంటే వీలునామాలో ఉన్న ఆస్తులకు స్టాంప్ డ్యూటీ కట్టే పని లేదు. కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.


31) వీలునామా రాసిన వ్యక్తి తనకు ఇష్టమైన పదజాలంతో వీలునామా రాయవచ్చు లేదా రాయించుకోవచ్చు. ప్రత్యేకమైన మాటలు కానీ, చట్టపరమైన మాటలు కానీ ఏమీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. 


32) వీలునామాను రిజిస్ట్రేషన్ చేయించు కోవాలనే ఆసక్తి ఉండి, తనకు తానుగా ఆఫీసుకు వెళ్లలేని పరిస్థితుల్లో రిజిస్ట్రార్‌ని సంప్రదిస్తే రిజిస్ట్రార్ స్వయంగా వీలునామా రాసే వ్యక్తి ఇంటికి లేదా ఆస్పత్రికి వెళ్లి వీలునామాను రిజిస్టర్ చేయాల్సి వుంటుంది.                     


33) 18 సంవత్సరాలు దాటిన స్త్రీ పురుషులు ఎవరైనా, తను జీవించి ఉండగా ఎప్పుడైనా వీలునామా రాయొచ్చు.


భారతదేశంలో వీలునామారకాలు


నిరుపయోగమైన వీలునామా

యాత్రలో పనిచేసే సైనికుడు కాని లేదా వాస్తవ యుద్ధంలో నిమగ్నమైన వ్యక్తి లేదా సముద్రంలో ఒక నావికుడు సృష్టించిన విల్ ను అప్రధానమైన విల్ అంటారు. అప్రధానమైన విల్ చెల్లుబాటు కావాలంటే, ఇది క్రింది షరతులను సంతృప్తి పరచాలి:


విల్‌ను సృష్టించే వ్యక్తి తన / ఆమె గుర్తును విల్‌కు సంతకం చేయాలి లేదా జతచేయాలి. లేకపోతే, అతని / ఆమె సమక్షంలో టెస్టేటర్ (విల్ విల్ క్రియేటింగ్) ఆదేశాల ప్రకారం మరికొందరు సంతకం చేయాలి.


టెస్టేటర్ యొక్క సంతకం లేదా గుర్తు లేదా టెస్టేటర్ కోసం సంతకం చేసిన వ్యక్తి యొక్క సంతకం తప్పనిసరిగా ఉంచాలి, తద్వారా ఇది విల్ వలె రచనను ప్రభావితం చేయడానికి ఉద్దేశించినట్లు కనిపిస్తుంది.


ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సాక్షులు సంకల్పానికి ధృవీకరించాలి. సాక్షులు టెస్టేటర్ గుర్తును చూడాలి లేదా అతని గుర్తును విల్‌కు అంటించాలి లేదా మరికొందరు వ్యక్తులు విల్‌పై సంతకం చేసి, సమక్షంలో మరియు టెస్టేటర్ దిశలో ఉండాలి.


ప్రివిలేజ్డ్ విల్


ప్రివిలేజ్డ్ విల్స్ అంటే సైనికుడు, ఎయిర్‌మెన్ లేదా నావికుడు వంటి క్రియాశీల సేవల్లో ఉన్నవారు వ్రాతపూర్వకంగా లేదా నోటి మాట ద్వారా తయారుచేసే విల్స్. కొంతమంది వ్యక్తులు త్వరగా విల్ చేయడానికి వీలుగా ఒక ప్రత్యేకమైన విల్ యొక్క చెల్లుబాటు కోసం చట్టపరమైన అవసరం తగ్గించబడింది. ప్రత్యేకమైన విల్ కోసం కింది షరతులు వర్తిస్తాయి:


టెస్టేటర్ తన ఇష్టంతో మొత్తం ఇష్టాన్ని వ్రాస్తాడు. అటువంటి సందర్భంలో, ఇది సంతకం లేదా ధృవీకరించాల్సిన అవసరం లేదు.


టెస్టేటర్ పూర్తిగా లేదా కొంత భాగాన్ని మరొక వ్యక్తి రాసిన విశేష విల్పై సంతకం చేయాలి. అటువంటి సందర్భంలో, ధృవీకరణ అవసరం లేదు.


ఒక విల్ పూర్తిగా లేదా పాక్షికంగా మరొక వ్యక్తి వ్రాసినది మరియు టెస్టేటర్ సంతకం చేయనిది చెల్లుబాటు అయ్యే విల్, ఇది టెస్టేటర్ ఆదేశాల మేరకు వ్రాయబడిందని లేదా టెస్టేటర్ దానిని అతని / ఆమె విల్ గా గుర్తించాడని రుజువైతే.


అమలు చేయకపోవడం వేరే కారణాల వల్ల జరిగిందని మరియు విల్ సృష్టించడానికి ఉద్దేశాలను వదిలివేసినట్లు కనిపించకపోతే సగం పూర్తయిన ప్రత్యేక విల్ కూడా చెల్లుబాటు అవుతుంది.


ఉద్దేశాలను ప్రకటించడం ద్వారానోటిమాట ద్వారా విశేషమైన విల్ చేయవచ్చు.


ఒక సైనికుడు లేదా ఎయిర్‌మెన్ లేదా నావికుడు విల్ తయారీకి వ్రాతపూర్వక లేదా శబ్ద సూచనలు ఇచ్చినా, దానిని తయారు చేసి అమలు చేయడానికి ముందే మరణించినట్లయితే. మరియు అలాంటి సంకల్పం చెల్లుబాటు అయ్యే విల్.


షరతులతో కూడినలేదా ఆకస్మిక విల్స్


కొన్ని షరతులను సంతృప్తిపరిచిన సందర్భంలో మాత్రమే ప్రభావం చూపడానికి ఒక విల్ వ్యక్తీకరించబడుతుంది లేదా ఇతర అంశాలపై నిరంతరంగా ఉంటుంది. అటువంటి విల్, కొంత ఆకస్మిక లేదా పరిస్థితి సంభవించినప్పుడు మాత్రమే చెల్లుతుంది, మరియు ఆకస్మిక సంఘటన జరగకపోతే లేదా పరిస్థితి విఫలమైతే, దానిని షరతులతో కూడిన లేదా అనిశ్చిత విల్ అంటారు. జాయింట్ విల్స్ జాయింట్ విల్ అనేది ఒక రకమైన విల్, ఇందులో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు సంయోగ విల్ చేయడానికి అంగీకరిస్తారు. 


ఒక ఉమ్మడి విల్ ఇద్దరు వ్యక్తుల మరణం తరువాత అమలులోకి రావాలని అనుకుంటే, అది వారి జీవిత కాలంలో అమలు చేయబడదు. ఉమ్మడి జీవితాల్లో లేదా మరణం తరువాత వ్యక్తి ఎప్పుడైనా ఉమ్మడి ఇష్టాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఉమ్మడి విల్స్ ఉమ్మడి విల్స్ ఒక వ్యక్తి చేత వ్రాయబడతాయి, ఇందులో రెండు లేదా అంతకంటే ఎక్కువ విల్స్ సౌలభ్యం కోసం ఆస్తిని పారవేయడానికి సూచనలను అందిస్తాయి. 


ఉదాహరణకు, ఒక విల్ అన్ని స్థిరమైన ఆస్తిని పారవేయడంతో వ్యవహరించగలదు, మరొక విల్ అన్ని కదిలే ఆస్తిని పారవేయడంతో వ్యవహరిస్తుంది. మ్యూచువల్ విల్స్ పరస్పర సంకల్పంలో, పరీక్షకులు ఒకరికొకరు పరస్పర ప్రయోజనాలను అందిస్తారు. భార్యాభర్తలు తమ జీవితకాలంలో అవతలి వ్యక్తికి అన్ని ప్రయోజనాలను అందించే పరస్పర సంకల్పం అమలు చేస్తారు.


డూప్లికేట్ విల్స్


టెస్టేటర్ ఒక బ్యాంక్ లేదా ఎగ్జిక్యూటర్ లేదా ట్రస్టీతో భద్రత లేదా భద్రత కోసం నకిలీ వీలునామాను సృష్టిస్తాడు. ఏదేమైనా, టెస్టేటర్ అతని / ఆమె అదుపులో ఉన్న విల్‌ను నాశనం చేస్తే, ఇతర విల్ కూడా ఉపసంహరించబడుతుంది.


షామ్ విల్స్


టెస్టేటర్ అతని / ఆమె ఇష్టానుసారం అమలు చేయకూడదనుకుంటే షామ్ విల్స్ అమలు చేయబడతారు కాని చెల్లదు. భారతీయ వారసత్వ చట్టం ప్రకారం, మోసం లేదా బలవంతం ద్వారా లేదా టెస్టేటర్ యొక్క ఉచిత ఏజెన్సీని తీసివేయడం ద్వారా చేసిన విల్ చెల్లదు. 


హోలోగ్రాఫ్ విల్స్ 

టెస్టేటర్ ఈ హోలోగ్రాఫ్ వీలునామాను పూర్తిగా దాని స్వంత చేతివ్రాతలో వ్రాస్తాడు. భారతదేశంలో విల్ సృష్టించడానికి, ఇండియాఫిలింగ్స్‌తో సన్నిహితంగా ఉండండి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.